Close Menu
  • Home
  • Recent Posts
  • Pet Health
  • Pet Nutrition
  • Pet Training
  • Pet Grooming
  • More
    • Pet Lifestyle
    • Pet Care
What's Hot

Mobile Dog Grooming Near Me: గ్రూమింగ్ సేవలు, ధరలు & బుకింగ్ గైడ్

July 26, 2026

Aggressive Dog Training – డాగ్ ట్రైనింగ్ టిప్స్

July 25, 2026

Positive Reinforcement Pet Training for Beginners: A Science-Based Guide

June 30, 2026

Common Pet Health Problems and Prevention: A Comprehensive Guide to Lifelong Wellness

June 30, 2026

The Comprehensive Guide to Bringing Home Your New Pet: Essential Care and Integration

June 30, 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
Dog Training Dog Grooming Dog FoodDog Training Dog Grooming Dog Food
Subscribe
  • Home
  • Recent Posts

    Mobile Dog Grooming Near Me: గ్రూమింగ్ సేవలు, ధరలు & బుకింగ్ గైడ్

    July 26, 2026

    Aggressive Dog Training – డాగ్ ట్రైనింగ్ టిప్స్

    July 25, 2026

    Positive Reinforcement Pet Training for Beginners: A Science-Based Guide

    June 30, 2026

    Common Pet Health Problems and Prevention: A Comprehensive Guide to Lifelong Wellness

    June 30, 2026

    The Comprehensive Guide to Bringing Home Your New Pet: Essential Care and Integration

    June 30, 2026
  • Pet Health
  • Pet Nutrition
  • Pet Training
  • Pet Grooming
  • More
    • Pet Lifestyle
    • Pet Care
Dog Training Dog Grooming Dog FoodDog Training Dog Grooming Dog Food
Home»Pet Grooming»Mobile Dog Grooming Near Me: గ్రూమింగ్ సేవలు, ధరలు & బుకింగ్ గైడ్
Pet Grooming

Mobile Dog Grooming Near Me: గ్రూమింగ్ సేవలు, ధరలు & బుకింగ్ గైడ్

Shredder SmithBy Shredder SmithJuly 26, 2026Updated:July 26, 2026No Comments10 Mins Read5 Views
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Mobile Dog Grooming Near Me
Share
Facebook Twitter LinkedIn Pinterest WhatsApp Email

Mobile Dog Grooming Near Me : ఈ సేవలు ఇప్పుడు చాలా మంది పెంపుడు కుక్కల యజమానులకు మంచి సౌకర్యంగా మారాయి. కుక్కను గ్రూమింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సిన పని లేకుండా, డాగ్ గ్రూమింగ్ చేయి వారు నేరుగా  మీ ఇంటికే వచ్చి అవసరమైన సేవలను మనకి అందిస్తారు. దీంతో మీ సమయం చాల ఆదా అవుతుంది. అలాగే ప్రయాణం వల్ల కుక్క,లకు కలిగే భయం, మరియు ఒత్తిడి కూడా తగ్గుతాయి.

కుక్క పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ఎంత ముఖ్యమో, క్రమం తప్పకుండా గ్రూమింగ్ చేయించడం కూడా అంతే ముఖ్యం అని మనం తెలుసు కోవాలి. శుభ్రంగా ఉండే కుక్కలో చర్మ సమస్యలు, వెంట్రుకలు ఎక్కువగా రాలడం, దుర్వాసన వంటి ఇబ్బందులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పొడవైన వెంట్రుకలు ఉన్న కుక్కలకు తగిన సమయానికి గ్రూమింగ్ చేయించడం చాలా అవసరం.

డాగ్ గ్రూమింగ్ అంటే ఏమిటి?

డాగ్ గ్రూమింగ్ అంటే కుక్కను శుభ్రంగా, ఆరోగ్యంగా చూసుకోవడం. కుక్కకు స్నానం చేయించడం, వెంట్రుకలు దువ్వడం, గోర్లు కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సంరక్షణ పనులన్నింటినీ డాగ్ గ్రూమింగ్ అంటారు.

ఇలా తరచూ గ్రూమింగ్ చేయడం వల్ల కుక్క శుభ్రంగా ఉంటుంది. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. దుర్వాసన తగ్గుతుంది. కుక్కకు సౌకర్యంగా ఉండటంతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా ముందుగానే గుర్తించవచ్చు.

కుక్కను శుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమో, మంచి అలవాట్లు నేర్పించడం కూడా అంతే అవసరం. క్రమం తప్పకుండా Dog Training ఇవ్వడం వల్ల కుక్క యజమాని మాట వినడం, ఇంట్లో ప్రశాంతంగా ఉండడం, బయటకు తీసుకెళ్లినప్పుడు నియంత్రణలో ఉండడం వంటి మంచి అలవాట్లు వస్తాయి.

చిన్న వయసులోనే సరైన శిక్షణ ప్రారంభిస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుక్కను చూసుకోవచ్చు. మీ పెంపుడు కుక్కకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఇంట్లోనే ఎలా నేర్పించాలి వంటి పూర్తి వివరాలను మా Dog Training ఆర్టికల్ లో తెలుసుకోండి.

ఈ వ్యాసంలో Mobile Dog Grooming Near Me సేవలు ఎలా పనిచేస్తాయి, ఎలాంటి సేవలు అందిస్తారు, Dog Grooming Price ఎంత ఉంటుంది, ఇంట్లో ఉపయోగపడే Dog Grooming Tool ఏవి, మంచి గ్రూమర్‌ను ఎలా ఎంచుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

Mobile Dog Grooming Close To Me అంటే ఏమిటి?

చాలా మంది తమ పెంపుడు కుక్కను గ్రూమింగ్ చేయించడానికి షాప్‌కు తీసుకెళ్తారు. కానీ మొబైల్ డాగ్ గ్రూమింగ్ సేవలో మాత్రం గ్రూమర్ నేరుగా మీ ఇంటికే వస్తారు. అవసరమైన అన్ని వస్తువులు తీసుకుని, మీ ఇంటి వద్దే కుక్కకు స్నానం చేయించడం, వెంట్రుకలు ట్రిమ్ చేయడం, గోర్లు కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం లాంటి పనులన్నీ పూర్తి చేస్తారు.

సమయం దొరకని వారికి, వృద్ధులకు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలకు చాలా మంచి సౌకర్యం అని చెప్పవచు. అలాగే కారులో కుక్కను తీసుకెళ్లడం ఇబ్బందిగా అనిపించినా, బయటకు వెళ్లడానికి భయపడే కుక్కలు ఉన్నా ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఇంట్లోనే గ్రూమింగ్ చేయడం వల్ల కుక్క కూడా భయపడకుండా ప్రశాంతంగా ఉంటుంది.

మొబైల్ డాగ్ గ్రూమింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు

ఇటీవల చాలా మంది పెంపుడు జంతువుల యజమానులు మొబైల్ డాగ్ గ్రూమింగ్ సేవను ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం ఇది సౌకర్యంగా ఉండటమే కాకుండా కుక్కకు కూడా మంచి అనుభవాన్ని ఇస్తుంది.

సమయం ఆదా అవుతుంది

కుక్కను బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు చెప్పిన సమయానికి గ్రూమర్ ఇంటికే వచ్చి సేవ పూర్తి చేస్తారు. దీంతో మీ సమయం కూడా ఆదా అవుతుంది.

కుక్క ప్రశాంతంగా ఉంటుంది

కొన్ని కుక్కలు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు భయపడతాయి లేదా అసౌకర్యంగా ఫీల్ అవుతాయి. ఇంటి దగ్గరే గ్రూమింగ్ చేయించడం వల్ల అవి ప్రశాంతంగా ఉండి సులభంగా సహకరిస్తాయి.

కుక్కపై పూర్తి శ్రద్ధ ఉంటుంది

గ్రూమర్ ఒకేసారి ఒక కుక్కను మాత్రమే చూసుకుంటారు. అందువల్ల ప్రతి పని జాగ్రత్తగా చేస్తూ, కుక్కకు అవసరమైన సంరక్షణను పూర్తిగా అందిస్తారు.

పరిశుభ్రంగా సేవ అందుతుంది

చాలా మొబైల్ గ్రూమింగ్ సేవల్లో ప్రతి కుక్కకు శుభ్రమైన పరికరాలనే ఉపయోగిస్తారు. దీంతో పరిశుభ్రత మెరుగ్గా ఉంటుంది. ఒక కుక్క నుంచి మరో కుక్కకు ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం కూడా తగ్గుతుంది.

Mobile Dog Grooming లో సాధారణంగా చేసే సేవలు

మొబైల్ డాగ్ గ్రూమింగ్‌లో కుక్కకు అవసరమైన చాలా సంరక్షణ పనులను ఇంటి దగ్గరే చేస్తారు. మీరు ఎలాంటి సేవ తీసుకుంటున్నారో దాన్ని బట్టి చేసే పనులు కొంచెం మారవచ్చు.

సేవ ఏమి చేస్తారు?
స్నానం కుక్కకు సరిపోయే షాంపూతో శుభ్రంగా స్నానం చేయిస్తారు.
వెంట్రుకలు ట్రిమ్ చేయడం కుక్క జాతిని బట్టి వెంట్రుకలను కత్తిరించి అందంగా తీర్చిదిద్దుతారు.
బ్రషింగ్ వెంట్రుకల్లో ఉన్న చిక్కులను తీసి శుభ్రంగా దువ్వుతారు.
గోర్లు కత్తిరించడం పొడవుగా పెరిగిన గోర్లను సరిచేస్తారు.
చెవులు శుభ్రం చేయడం చెవుల్లో పేరుకున్న మురికిని జాగ్రత్తగా తొలగిస్తారు.
కళ్ల చుట్టూ శుభ్రం చేయడం కళ్ల దగ్గర ఉన్న మురికిని శుభ్రం చేస్తారు.
ఆరబెట్టడం స్నానం చేసిన తర్వాత వెంట్రుకలు పూర్తిగా ఆరేలా చూస్తారు.

Mobile Dog Grooming Near Me

Dog Grooming – కుక్కకు ఎన్ని రోజులకు గ్రూమింగ్ చేయాలి?

ప్రతి కుక్కకు ఒకే సమయంలో గ్రూమింగ్ అవసరం ఉండదు. దాని జాతి, వెంట్రుకల పొడవు, బయట ఎంత తిరుగుతుందనే విషయాలను బట్టి గ్రూమింగ్ చేయించే సమయం మారుతుంది.

కుక్క రకం ఎంత తరచుగా చేయాలి?
పొట్టి వెంట్రుకలు ఉన్న కుక్కలు 6 నుంచి 8 వారాలకు ఒకసారి
పొడవైన వెంట్రుకలు ఉన్న కుక్కలు 4 నుంచి 6 వారాలకు ఒకసారి
ఎక్కువ వెంట్రుకలు రాలే జాతులు నెలకు ఒకసారి
బయట ఎక్కువగా తిరిగే కుక్కలు అవసరాన్ని బట్టి త్వరగా చేయించాలి

గ్రూమింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేయడం మంచిది కాదు. అలా చేస్తే వెంట్రుకలు చిక్కుకుపోవచ్చు. చర్మ సమస్యలు రావచ్చు. దుర్వాసన కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

అమెరికాలో డాగ్ గ్రూమింగ్ ధరలు పట్టిక

కుక్క పరిమాణం, తీసుకునే సేవను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ఉండే అంచనా ధరలు ఈ క్రింది విదంగా ఉన్నాయి.

సేవ చిన్న కుక్క మధ్యస్థ కుక్క పెద్ద కుక్క ఇందులో ఉండే సేవలు
బేసిక్ బాత్ $30 – $50 $40 – $60 $50 – $80 స్నానం, షాంపూ, డ్రై, బ్రషింగ్
ఫుల్ గ్రూమింగ్ $50 – $90 $70 – $110 $90 – $150 స్నానం, ట్రిమ్మింగ్, బ్రషింగ్, గోర్లు, చెవుల శుభ్రత
మొబైల్ డాగ్ గ్రూమింగ్ $80 – $120 $100 – $150 $140 – $200+ గ్రూమర్ ఇంటికే వచ్చి పూర్తి సేవ అందిస్తారు
గోర్లు కత్తిరించడం $10 – $20 $15 – $25 $20 – $30 గోర్లు మాత్రమే కత్తిరిస్తారు
చెవులు శుభ్రం చేయడం $10 – $20 $10 – $20 $15 – $25 చెవులను శుభ్రం చేస్తారు
పళ్లు శుభ్రం చేయడం $10 – $20 $10 – $20 $15 – $25 పళ్లను శుభ్రం చేస్తారు
డీ-షెడ్డింగ్ $20 – $40 $30 – $50 $40 – $70 రాలిపోయే వెంట్రుకలను తొలగిస్తారు
ఫ్లీ & టిక్ ట్రీట్మెంట్ $20 – $50 $25 – $60 $30 – $70 పేలు, టిక్స్ నివారణ కోసం చికిత్స
పప్పీ గ్రూమింగ్ $40 – $70 $50 – $80 $60 – $90 చిన్న కుక్కలకు ప్రత్యేక గ్రూమింగ్
లగ్జరీ స్పా గ్రూమింగ్ $100 – $180 $120 – $220 $180 – $300+ స్పా, మసాజ్, ప్రత్యేక కోట్ కేర్

గమనిక

పై ధరలు అమెరికాలో సాధారణంగా కనిపించే అంచనా ధరలు మాత్రమే. మీరు ఉండే నగరం, గ్రూమింగ్ సెంటర్, కుక్క యొక్క జాతి, తీసుకునే ప్యాకేజీని బట్టి ధరలు మారవచ్చు.

New York, Los Angeles, San Francisco, Seattle, Miami వంటి పెద్ద నగరాల్లో సాధారణంగా గ్రూమింగ్ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది.

Golden Retriever, Poodle, Shih Tzu వంటి పొడవైన వెంట్రుకలు ఉన్న కుక్కలకు హెయిర్ స్టైల్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వాటి సేవల ధర కూడా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

Mobile Dog Grooming ఎప్పుడు అవసరం అవుతుంది?

కొన్ని సందర్భాల్లో కుక్కను గ్రూమింగ్ షాప్‌కు తీసుకెళ్లడం కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇంటికే వచ్చే సేవ మంచి సేవల్లో భాగం అని చెప్పవచ్చు.

  • వయసు పైబడిన కుక్కలకు
  • అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వాటికి.
  • కారులో ప్రయాణం చేయడానికి ఇష్టపడని కుక్కలకు
  • బయటకు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉన్నప్పుడు
  • ఇంట్లోనే ప్రశాంతంగా గ్రూమింగ్ చేయించాలని అనుకునే వారికి

ఇండియాలో సాధారణంగా ఉండే Dog Grooming Price

సేవ సుమారు ధర
కేవలం స్నానం ₹500 – ₹1,000
స్నానం + బ్రషింగ్ ₹700 – ₹1,500
పూర్తి గ్రూమింగ్ ₹1,000 – ₹3,000
పెద్ద జాతి కుక్కలకు పూర్తి గ్రూమింగ్ ₹2,000 – ₹5,000
Mobile Dog Grooming ₹1,500 – ₹4,500

గమనిక: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ధరలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

Dog Grooming Price ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది?

గ్రూమింగ్ ధరను నిర్ణయించడంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి.

కుక్క పరిమాణం

చిన్న కుక్కలకు తక్కువ సమయం పడుతుంది. పెద్ద కుక్కలకు ఎక్కువ సమయం, ఎక్కువ షాంపూ మరియు ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది.

వెంట్రుకల పొడవు

పొడవైన వెంట్రుకలు ఉన్న కుక్కలకు దువ్వడం, ట్రిమ్ చేయడం ఎక్కువ సమయం పడుతుంది.

కుక్క ప్రవర్తన

కొన్ని కుక్కలు ప్రశాంతంగా ఉంటాయి. మరికొన్ని కుక్కలు భయపడటం లేదా ఎక్కువగా కదలడం వల్ల గ్రూమింగ్‌కు ఎక్కువ సమయం పట్టవచ్చు.

అదనపు సేవలు

కొన్ని గ్రూమర్లు ఈ సేవలకు అదనపు ఛార్జ్ తీసుకుంటారు.

  • టిక్ తొలగించడం
  • ప్రత్యేక షాంపూ
  • దంతాల శుభ్రత
  • డీ-షెడ్డింగ్
  • ప్రత్యేక హెయిర్ స్టైల్

Dog Grooming Tool – ఇంట్లో ఉపయోగపడే పరికరాలు

ప్రతిసారి గ్రూమింగ్ సెంటర్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. ఇంట్లోనే చిన్న చిన్న గ్రూమింగ్ పనులు చేసుకోవడానికి కొన్ని పరికరాలు ఉంటే చాలా ఉపయోగపడుతుంది.

ప్రతి ఇంట్లో ఉండాల్సిన Dog Grooming Tool

పరికరం ఉపయోగం
డాగ్ బ్రష్ వెంట్రుకలు దువ్వడానికి
దువ్వెన చిక్కులు తొలగించడానికి
నెయిల్ క్లిప్పర్ గోర్లు కత్తిరించడానికి
డాగ్ షాంపూ స్నానం చేయించడానికి
టవల్ శరీరాన్ని తుడవడానికి
హెయిర్ డ్రైయర్ వెంట్రుకలు ఆరబెట్టడానికి
ట్రిమ్మర్ వెంట్రుకలు కత్తిరించడానికి

పరికరాలు కొనేటప్పుడు నాణ్యత ఉన్నవే ఎంచుకోవాలి. చౌకగా దొరికిందని నాసిరకం వస్తువులు కొనడం మంచిది కాదు.

ఇంట్లో గ్రూమింగ్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • మనుషుల షాంపూను కుక్కలకు ఉపయోగించకండి.
  • స్నానం తర్వాత వెంట్రుకలను పూర్తిగా ఆరబెట్టండి.
  • చెవుల్లోకి నీరు పోకుండా జాగ్రత్తపడండి.
  • గోర్లు చాలా చిన్నగా కత్తిరించకండి.
  • కుక్క భయపడితే బలవంతం చేయకండి.

నెమ్మదిగా మాట్లాడితే చాలా కుక్కలు ప్రశాంతంగా ఉంటాయి.

Dog Grooming Self Service Near Me

ఇది ఎలా ఉంటుందంటే, అక్కడ ప్రత్యేకంగా గ్రూమింగ్ కోసం టబ్, షాంపూ, డ్రైయర్, బ్రష్ వంటి పరికరాలు ఉంటాయి. మీరు మీ కుక్కను మీరే శుభ్రం చేసుకోవచ్చు. అవసరమైన అన్ని వస్తువులు అక్కడే అందుబాటులో ఉంటాయి.

ఇంటి బాత్‌రూమ్‌లో పెద్ద కుక్కకు స్నానం చేయించడం కష్టంగా అనిపించే వారికి ఈ సేవ చాలా ఉపయోగపడుతుంది.

ఇటీవల కొన్ని నగరాల్లో Dog Grooming Self Service Near Me అనే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.

Dog Grooming Cost At PetSmart గురించి

PetSmart వంటి పెద్ద పెట్ స్టోర్లలో బేసిక్ బాత్, పూర్తి గ్రూమింగ్, నెయిల్ ట్రిమ్మింగ్, బ్రషింగ్ వంటి వేర్వేరు ప్యాకేజీలు ఉంటాయి. మీరు ఎంచుకునే సేవ, కుక్క పరిమాణం మరియు జాతిని బట్టి ధర మారుతుంది.

అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే ముందు సేవల్లో ఏమేమి ఉంటాయి, ఎంత సమయం పడుతుంది, మొత్తం ఖర్చు ఎంత అవుతుంది అనే వివరాలు తెలుసుకోవడం మంచిది.

విదేశాల్లో నివసించే వారు ఎక్కువగా Dog Grooming Cost At PetSmart గురించి తెలుసుకోవాలని చూస్తుంటారు.

Dog Grooming Selection – మంచి గ్రూమర్‌ను ఎలా ఎంచుకోవాలి?

ప్రస్తుతం చాలా చోట్ల గ్రూమింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ అందరూ ఒకే విధమైన నాణ్యతతో సేవ ఇవ్వరు. అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాలు మనం తప్పకుండ తెలుసు కోవాలి.

గ్రూమర్‌ ఎంపిక

✔️ గ్రూమర్‌కు మంచి అనుభవం ఉందా?

✔️ కస్టమర్ రివ్యూలు ఎలా వున్నాయి?

✔️ కుక్కలను ప్రేమగా చూసుకుంటున్నారా?

✔️ ఉపయోగించే పరికరాలు శుభ్రంగా ఉన్నాయా?

✔️ ధరలను ముందుగానే స్పష్టంగా చెబుతున్నారా?

✔️ అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారో వివరించారా?

మంచి గ్రూమర్‌ను ఎంచుకోవడం వల్ల మీ కుక్కకు సురక్షితమైన, నాణ్యమైన సేవ లభిస్తుంది.

Mobile Dog Grooming Near Me

గ్రూమింగ్ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసే ముందు ఇంటి దగ్గర చేయవలసినవి

గ్రూమర్ వచ్చే ముందు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే వారికి పని మరింత సులభం అవుతుంది.

  • కుక్కను కొద్దిసేపు ఆరు బయట ననడిపించడం.
  • తాగడానికి నీరు పెట్టడం.
  • టీకాలు పూర్తయ్యాయో లేదో చూసుకోవడం.
  • కుక్కకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ముందే చెప్పడం.
  • మీకు కావాల్సిన హెయిర్ స్టైల్ లేదా ట్రిమ్ గురించి ముందే డిటైల్డ్ గా వివరించండి.

Mobile Dog Grooming Near Me Vs గ్రూమింగ్ సెంటర్.. ఏది మంచిది?

కుక్కకు గ్రూమింగ్ చేయించాలంటే ఇంటికే గ్రూమర్‌ను పిలవాలా? లేక గ్రూమింగ్ సెంటర్‌కు తీసుకెళ్లాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఏది మంచిదో మీ కుక్క స్వభావం, మీకు ఉన్న సమయం, అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు.

అంశం Mobile Dog Grooming గ్రూమింగ్ సెంటర్
సేవ ఇంటి వద్దే గ్రూమింగ్ షాప్‌లో
ప్రయాణం అవసరం లేదు కుక్కను తీసుకెళ్లాలి
కుక్కకు ఇబ్బంది తక్కువ కొన్ని కుక్కలు భయపడవచ్చు
సమయం ఆదా అవుతుంది కొంత సమయం పడుతుంది
ఖర్చు కొద్దిగా ఎక్కువ సాధారణంగా తక్కువ

బయటకు వెళ్లడానికి ఇష్టపడని కుక్కలు ఉంటే, ఇంటికే వచ్చే గ్రూమింగ్ సేవ మంచి మంచి పద్ధతి.

గ్రూమింగ్ చేయునపుడు గుర్తు పెట్టు కోవలసిన విషయాలు

చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కుక్క ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది.

  • గ్రూమింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వెయ్య వద్దు.
  • కుక్కల కోసం తయారు చేసిన షాంపూనే వాడాలి.
  • గోర్లు మరీ పెద్దవిగా పెరగక ముందే కట్ చేయించాలి
  • చెవులను తరచూ శుభ్రం చేయాలి.
  • నాణ్యమైన గ్రూమింగ్ పరికరాలనే ఉపయోగించేలా చూడాలి

క్రమం తప్పకుండా గ్రూమింగ్ చేస్తే…

గ్రూమింగ్ వల్ల కుక్క అందంగా కనిపించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

  • శరీరం శుభ్రంగా ఉంటుంది.
  • వెంట్రుకలు చిక్కులు పడకుండా ఉంటాయి.
  • దుర్వాసన తగ్గుతుంది.
  • చర్మ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.
  • గోర్లు సరైన పొడవులో ఉంటాయి.

ఇంట్లో కూడా చేయాల్సిన గ్రూమింగ్ పనులు

గ్రూమింగ్ చేసిన తర్వాత కూడా ఇంట్లో కొంత జాగ్రత్త అవసరం.

  • వారానికి రెండు లేదా మూడు సార్లు వెంట్రుకలు దువ్వండి.
  • పడుకునే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచండి.
  • బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్లు కడగండి.
  • వర్షంలో తడిస్తే వెంటనే ఆరబెట్టండి.
  • చర్మంపై ఏవైనా మార్పులు కనిపిస్తే వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించండి.

గ్రూమర్‌ను బుక్ చేసే ముందు అడిగి తెలుసు కోవలసినవి

సేవ తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది.

  • మీకు ఎంత అనుభవం ఉంది?
  • మా కుక్క జాతికి ఇంతకుముందు గ్రూమింగ్ చేశారా?
  • పూర్తి ప్యాకేజీలో ఏయే సేవలు ఉంటాయి?
  • మొత్తం ఖర్చు ఎంత?
  • అదనపు ఛార్జీలు ఉంటాయా?

ఎప్పుడు వెటర్నరీ డాక్టర్‌ సర్వీస్ మనం బుక్ చీసుకోవాలి?

గ్రూమింగ్ సమయంలో లేదా తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

  • చర్మంపై గాయాలు లేదా రక్తస్రావం
  • చెవుల నుంచి దుర్వాసన రావడం
  • ఎక్కువగా వెంట్రుకలు రాలిపోవడం
  • కుక్క నొప్పితో ఇబ్బంది పడడం
  • ఆహారం తినకపోవడం

Dog Grooming Close To ME :  Conclusion

పెంపుడు కుక్క ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలంటే క్రమం తప్పకుండా గ్రూమింగ్ చేయించడం చాలా ముఖ్యం. గ్రూమింగ్ వల్ల కుక్క అందంగా కనిపించడమే కాదు, చర్మం, వెంట్రుకలు, గోర్లు కూడా మంచి గా ఉంటాయి. చిన్న సమస్యలను కూడా ముందుగానే గుర్తించి జాగ్రత్త పడే అవకాశం మనకి ఉంటుంది.

ఇటీవల చాలా మంది Mobile Dog Grooming Near Me సేవలను ఎంచుకుంటున్నారు. గ్రూమర్ ఇంటికే వచ్చి సేవలు అందించడం వల్ల సమయం చాల వరకు ఆదా అవుతుంది. అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడని కుక్కలకు కూడా ఇది మంచి సౌకర్యం ఉంటుంది.

గ్రూమింగ్ చేయించేటప్పుడు ధర మాత్రమే చూడకుండా, గ్రూమర్ అనుభవం, పరిశుభ్రత, ఉపయోగించే పరికరాలు, కస్టమర్ రివ్యూలు కూడా ఒకసారి పరిశీలించడం మంచిది. మంచి గ్రూమింగ్ అలవాటు వల్ల మీ పెంపుడు కుక్క ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది జీవించి మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది.

 (FAQs) – Dog Grooming Mobile

1. Mobile Dog Grooming Near Me అంటే ఏమిటి?

గ్రూమర్ మీ ఇంటికే వచ్చి కుక్కకు స్నానం, హెయిర్ ట్రిమ్మింగ్, గోర్లు కత్తిరించడం వంటి సేవలు చేయడాన్ని Mobile Dog Grooming అంటారు.

2. Dog Grooming ధర ఎంత ఉంటుంది?

ఇండియాలో సాధారణంగా ₹1,500 నుంచి ₹4,500 వరకు ఉండవచ్చు. నగరం, కుక్క పరిమాణం మరియు సేవలను బట్టి ధర మారుతుంది.

3. కుక్కకు ఎంత తరచుగా గ్రూమింగ్ చేయించాలి?

చాలా కుక్కలకు 4 నుంచి 8 వారాలకు ఒకసారి గ్రూమింగ్ చేయించడం మంచిది. అయితే ఇది కుక్క జాతిని బట్టి మారుతుంది.

4. ఇంట్లోనే గ్రూమింగ్ చేయవచ్చా?

చిన్న పనులు, అంటే వెంట్రుకలు దువ్వడం లేదా స్నానం చేయించడం ఇంట్లో చేయవచ్చు. పూర్తి గ్రూమింగ్ కోసం అనుభవం ఉన్న గ్రూమర్‌ను సంప్రదించడం మంచిది.

5. Dog Grooming Tool కొనేటప్పుడు ఏమి చూడాలి?

నాణ్యమైన బ్రష్, దువ్వెన, నెయిల్ క్లిప్పర్, డాగ్ షాంపూ మరియు ట్రిమ్మర్ వంటి మంచి నాణ్యత ఉన్న పరికరాలను ఎంచుకోవాలి.

6. Mobile Dog Grooming చిన్న కుక్కలకు మాత్రమేనా?

కాదు. చిన్న, మధ్యస్థ మరియు పెద్ద జాతి కుక్కలకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

7. గ్రూమింగ్‌కు ముందు కుక్కకు ఆహారం పెట్టవచ్చా?

తేలికపాటి ఆహారం ఇవ్వవచ్చు. కానీ గ్రూమింగ్ ప్రారంభానికి ముందు ఎక్కువగా తినిపించకుండా ఉండటం మంచిది.

8. గ్రూమింగ్ వల్ల వెంట్రుకలు తక్కువగా రాలుతాయా?

క్రమం తప్పకుండా బ్రషింగ్ మరియు గ్రూమింగ్ చేయించడం వల్ల రాలిపోయే వెంట్రుకలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చర్మం కూడా శుభ్రంగా ఉంటుంది.

9. Dog Grooming Self Service Near Me అంటే ఏమిటి?

మీరు స్వయంగా మీ కుక్కకు స్నానం చేసి గ్రూమింగ్ చేసుకునే సౌకర్యాన్ని Self Service Grooming అంటారు. అవసరమైన పరికరాలు అక్కడే అందుబాటులో ఉంటాయి.

10. మంచి గ్రూమర్‌ను ఎలా గుర్తించాలి?

అనుభవం, కస్టమర్ రివ్యూలు, పరిశుభ్రత, ప్రేమగా కుక్కలను చూసుకునే విధానం మరియు స్పష్టమైన ధర వివరాలు ఉన్న గ్రూమర్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Previous ArticleAggressive Dog Training – డాగ్ ట్రైనింగ్ టిప్స్
Avatar
Shredder Smith
  • Website

Shredder Smith is a passionate writer and technology enthusiast who enjoys exploring the latest trends in IT, gadgets, and digital careers. With a keen interest in helping readers navigate the world of tech and professional growth, Shredder shares insights, tips, and practical advice for both beginners and experienced professionals. When not writing, he enjoys learning about emerging technologies and finding new ways to make complex topics easy to understand.

Related Posts

Stress-Free Dog Nail Trimming: A Comprehensive Guide to Home Grooming

June 30, 2026

The Ultimate Guide to Selecting the Best Pet Shampoo for Itchy Skin

June 30, 2026

How to Clean a Dog’s Ears Safely: A Comprehensive Veterinary-Approved Guide

June 30, 2026
Leave A Reply Cancel Reply

Latest Posts

Mobile Dog Grooming Near Me: గ్రూమింగ్ సేవలు, ధరలు & బుకింగ్ గైడ్

July 26, 20265 Views

Aggressive Dog Training – డాగ్ ట్రైనింగ్ టిప్స్

July 25, 202615 Views

Positive Reinforcement Pet Training for Beginners: A Science-Based Guide

June 30, 20264 Views

Common Pet Health Problems and Prevention: A Comprehensive Guide to Lifelong Wellness

June 30, 20262 Views

The Comprehensive Guide to Bringing Home Your New Pet: Essential Care and Integration

June 30, 20261 Views
About Us
About Us

PetsCareHelp.com provides trusted guides on pet health, nutrition, training, grooming, care, and lifestyle. Discover expert-backed tips, practical advice, beginner-friendly resources for dogs, cats, puppies, kittens, and responsible pet ownership. Learn smarter, care better, every day, today.

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Fresh Find

Mobile Dog Grooming Near Me: గ్రూమింగ్ సేవలు, ధరలు & బుకింగ్ గైడ్

July 26, 2026

Aggressive Dog Training – డాగ్ ట్రైనింగ్ టిప్స్

July 25, 2026

Positive Reinforcement Pet Training for Beginners: A Science-Based Guide

June 30, 2026
Most Popular

Aggressive Dog Training – డాగ్ ట్రైనింగ్ టిప్స్

July 25, 202615 Views

Mobile Dog Grooming Near Me: గ్రూమింగ్ సేవలు, ధరలు & బుకింగ్ గైడ్

July 26, 20265 Views

Positive Reinforcement Pet Training for Beginners: A Science-Based Guide

June 30, 20264 Views
© 2026 PetsCareHelp. Designed by PetsCareHelp.
  • About Us
  • Contact Us
  • Cookie Policy
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Type above and press Enter to search. Press Esc to cancel.