Aggressive Dog Training – కోపంగా ఉండే కుక్కలకు ట్రైనింగ్
Aggressive Dog Training గురించి తెలుసుకోవాలంటే ముందుగా కుక్క ఎందుకు దూకుడుగా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవాలి. కుక్కలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అవి కుటుంబ సభ్యుల్లా మనతో కలిసిపోతాయి విశ్వాసంగా, నమ్మకంగా ఉంటాయి. కానీ కొన్ని కుక్కలు చిన్న విషయానికే ఎక్కువగా అరుస్తూ మొరుగుతాయి లేదా దూకుడుగా ప్రవర్తిస్తాయి. దీనికి భయం, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు , సరైన శిక్షణ లేకపోవడం లేదా చిన్నప్పటి నుంచి అలవాట్లు చేయక పోయి ఉండొచ్చు .
ఇలాంటి ప్రవర్తనను మార్చడానికి Dog Training చాలా ఉపయోగపడుతుంది. కానీ ప్రేమతో, ఓపికగా సరైన విధంగా శిక్షణ ఇస్తే అది నెమ్మదిగా మంచి ప్రవర్తనను అలవాటు చేసుకుంటుంది. ఈ ఆర్టికల్ లో డాగ్ ట్రైనర్లు సూచించిన చిట్కాలతో పాటు, మీకు పనికొచ్చే సమాచారాన్ని ఇవ్వడం జరిగింది.
Aggressive Dog Training అంటే ఏంటి, ఎలా ఇవ్వాలి?
సింపుల్‌గా చెప్పాలంటే, కుక్కలో ఉన్న దూకుడు లేదా కోపాన్ని తగ్గించి, ప్రశాంతంగా ఉండేలా శిక్షణ ఇవ్వడాన్నే అగ్రెసివ్ డాగ్ ట్రైనింగ్ అంటారు. అయితే ట్రైనింగ్ ప్రారంభించే ముందు కుక్క ఎందుకు అలా ప్రవర్తిస్తుందో ఏదయినా ఆరోగ్యం సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కారణాన్ని మనం గుర్తిస్తే, దానికి సరిపోయే విధంగా శిక్షణ ఇప్పించడం సులభమవుతుంది.
డాగ్ ట్రైనింగ్ ఇచ్చే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
1. మీరు ముందు ప్రశాంతంగా ఉండాలి
కుక్క అరిస్తే మీరు ఇంకా గట్టిగా అరిస్తే ఏమి లాభం లేదు. నెమ్మదిగా మాట్లాడండి. మీరు తన ఫ్రెండ్ లేద యజమాని అని కుక్కకు తెలియాలి.
2. తొందరపడకండి
ఒకే రోజులో అన్నీ నేర్పడం కుదరదు. రోజుకు 10 నిమిషాలు శిక్షణ చాలు. క్రమంగా అలవాటు చేయండి.
3. ఎప్పుడు కోపం వస్తుందో గమనించండి
అది డెలివరీ బాయ్ వచ్చినప్పుడా? లేక మరో కుక్కను చూసినప్పుడా? కారణం తెలుసు కో గలిగితేనా, శిక్షణను ఇవ్వడం సులభం అవుతుంది

Aggressive Dog Training – కుక్కల దూకుడు ప్రవర్తన కు కారణాలు
Dog Training Treats ఎలా ఉపయోగించాలి?
కుక్కకు శిక్షణ ఇస్తున్నప్పుడు Dog Training Treats చాలా ఉపయోగపడతాయి. కుక్క మీరు చెప్పిన మాట విన్నా, మంచి పని చేసినా లేదా శాంతంగా ప్రవర్తించినా వెంటనే చిన్న ట్రీట్ ఇస్తే, అదే పని మళ్లీ చేయాలని అది త్వరగా నేర్చుకుంటుంది. దీన్నే రివార్డ్ ట్రైనింగ్ లేదా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు.
ఉదాహరణకు, మీరు “కూర్చో” అని చెప్పినప్పుడు కుక్క వెంటనే కూర్చుంటే చిన్న ట్రీట్ ఇవ్వండి. ఎవరైనా ఇంటికి వచ్చినా మొరగకుండా ప్రశాంతంగా వున్నా కూడా ట్రీట్ ఇచ్చి మెచ్చుకోండి. అలాగే ఇతర కుక్కలతో లేదా మనుషులతో బాగా కలిసిపోతే “గుడ్ బాయ్” లేదా “గుడ్ గర్ల్” అని ప్రేమగా చెప్పి చిన్న బహుమతి ఇవ్వండి. ఇలా చేస్తే కుక్కకు ఏ పని చేస్తే బహుమతి వస్తుందో తెలుస్తుంది ఇంకా అగ్రెసివ్ గా ఉండ కూడదు అని అర్థమవుతుంది.
ట్రీట్స్ కొనేటప్పుడు కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాటినె ఎంచుకోవాలి. అవి చిన్న సైజులో, ఆరోగ్యానికి మంచివిగా ఉండాలి. ఉప్పు, చక్కెర లేదా కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్న ట్రీట్స్ ఇవ్వక పోవడం మంచిది. అలాగే ట్రీట్స్‌ను ఎక్కువగా ఇవ్వకుండా, శిక్షణ సమయంలో మాత్రమే బహుమతిగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Dog Training Cost – శిక్షణకు ఎంత ఖర్చు అవుతుంది?
మీరు ఇంట్లో కుక్కకు శిక్షణ ఇవ్వలేకపోతే, అనుభవం ఉన్న డాగ్ ట్రైనర్ లేదా డాగ్ ట్రైనింగ్ సెంటర్ సంప్రదించి సహాయం తీసుకోవచ్చు. అక్కడ ట్రైనర్ కుక్కకు మాత్రమే కాదు, యజమానికి కూడా కుక్కను చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎలా శిక్షణ ఇవ్వాలి అనే విషయాలు వివరంగా నేర్పిస్తారు. దీంతో కుక్క ప్రవర్తనలో త్వరగా మార్పు కనిపించే అవకాశం మెరుగ్గా ఉంటుంది.
అయితే ట్రైనర్‌ను ఎంపిక చెసుకొనే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ట్రైనర్‌కు మంచి అనుభవం ఉండాలి, మరియు రివ్యూస్ చూసుకోవాలి. కుక్కను కొట్టడం లేదా భయపెట్టడం కాకుండా, ప్రేమతో మరియు ఓపికగా శిక్షణ ఇచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాడో లేదో గమనించాలి. అలాగే ఇంతకుముందు శిక్షణ పొందిన కుక్కల యజమానుల అభిప్రాయాలు, రివ్యూలు కూడా పరిశీలించడం మరి మంచిది. ఒకేసారి చాలా కుక్కలకు కు ట్రైనింగ్ ఇవ్వడం కంటే, తక్కువ సంఖ్యలో కుక్కలకు సమయం కేటాయించే ట్రైనర్‌ను ఎంచుకుంటే మెరుగైన ఫలితం వస్తుంది.
Dog Training Cost ప్రాంతం, అనుభవం కలిగిన ట్రైనర్ , శిక్షణ విధానాలు మరియు కోర్సు కాలం వ్యవధిని బట్టి మారుతుంది. గ్రూప్ క్లాసులు సాధారణంగా తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటాయి. వ్యక్తిగత (పర్సనల్) ట్రైనింగ్ లేదా ఇంటికే వచ్చి శిక్షణ ఇచ్చే సేవలకు కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే అవుతుంది. అందుకే ముందుగా ఫీజు, కోర్సు వ్యవధి మరియు శిక్షణ విధానం గురించి పూర్తిగా తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఖర్చులు అనేవి ప్రాంతం మరియు శిక్షకుడిని బట్టి మారుతూ ఉంటాయి. గ్రూప్ క్లాసులు అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కాగా, పర్సనల్ ట్రైనింగ్ ధర మధ్యస్థంగా ఉంటుంది; ఇంటి వద్ద శిక్షణకు కొంచెం ఎక్కువ ఖర్చవుతుంది, అలాగే ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి అధిక వ్యయం అవుతుంది. కేవలం ధరపైనే దృష్టి పెట్టడం కంటే, శిక్షకుడి అనుభవాన్ని, బోధనా విధానమే అత్యంత ముఖ్యం.
Aggressive Dog Training :
ప్రతిరోజూ బయటకు తీసుకువెళ్ళండి: కుక్కకు ఆటలు మరియు నడిపించడం చాలా అవసరం; లేకపోతే, అది విసుగు చెంది చిరాకు పడవచ్చు. చుటుపకాల వారికి పరిచయం చేయండి: క్రమంగా పిల్లలకు మరియు ఇతర కుక్కలకు దానిని అలవాటు చేయండి. మంచి పని చేసినపుడు వెంటనే ప్రశంసించండి:
కుక్క ప్రశాంతంగా ఉన్నప్పుడు, వెంటనే “Good boy” (మంచి కుక్క) అని అనండి.
మీరు ఖచ్చితంగా చేయకూడని పనులు ఇవి:
- కొట్టడం (దీనివల్ల భయం, కోపం పెరుగుతాయి),
- అరవడం (కుక్కలో ఒత్తిడి పెరుగుతుంది),
- స్థిరత్వం లేని నియమాలు పాటించడం (కుక్కకు అర్థం కాదు), మరియు
- ఆటలు ఆడించకపోవడం
చిన్నపాటి ప్రవర్తనా సమస్యలను ఇంట్లోనే సరిదిద్దుకోవచ్చు. అయితే, కుక్క ఎవరినైనా కరిస్తే లేదా ప్రమాదకరమైన ప్రవర్తనను ప్రదర్శిస్తే, వెంటనే దానిని పశువైద్యుని వద్దకు లేదా వృత్తిపరమైన శిక్షకుని వద్దకు తీసుకు ని వెళ్ళాలి.
Aggressive Dog Training అంటే దూకుడుగా ఉండే కుక్కకు శిక్షణ ఇవ్వడం అంటే దానిని కొట్టడం కాదు; కుక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం. సరైన శిక్షణా బహుమతులు, నాణ్యమైన కోర్సులు మరియు ఓర్పుతో, ట్రైనింగ్ ఇవ్వగలిగితే కుక్క ఖచ్చితంగా మారగలదు. ఖర్చు గురించి చింతించకుండా, మీ కుక్కను ఒక మంచి స్నేహితునిగా మార్చడంపై దృష్టి పెట్టండి.
Dog Training Cost ఎంత ఖర్చు ఉండొచ్చు?
డాగ్ ని ట్రైన్ చేయాడం ఇండి దగ్గర మీ వల్ల కావడం లేదా? అయితే కోర్సులో చేర్పించడం మంచిది. అక్కడ ట్రైనర్ గారు కుక్కతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలో అన్నీ నేర్పిస్తారు.మంచి కోర్సు అంటే ఎలా ఉండాలి?ట్రైనర్ గారికి మంచి అనుభవం ఉండాలి కుక్కను కొట్టకుండా, ప్రేమగా నేర్పాలి.
Dog Training Near Me
చిన్నపాటి ప్రవర్తనా సమస్యలను మీరు ఇంట్లోనే సరిదిద్దుకోవచ్చు. అయితే, కుక్క ఎవరినైనా కరిస్తే లేదా అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తిస్తుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే దానిని పశువైద్యుని వద్దకు లేదా వృత్తిపరమైన శిక్షకుని వద్దకు తీసుకువెళ్లడం ఉత్తమం.
Aggressive Dog Training అంటే కుక్కను భయపెట్టడం కాదు. ప్రేమగా, ఓపికగా దాని కోపానికి కారణం తెలుసుకుని సరిచేయడం. రోజూ వ్యాయామం, సోషలైజేషన్, Dog Training Treats ఉపయోగించడం వల్ల కుక్క త్వరగా మారుతుంది.
Dog Training for Barking – అరుపులను ఎలా తగ్గించాలి
కుక్కలు కారణం లేకుండా అరవవు. భయం, విసుగు, కాపలా కాయడం లేదా తమ వైపు దృష్టిని ఆకర్షించడం వంటి కారణాల వల్ల అవి అరుస్తాయి. ముందుగా, కుక్క ఎందుకు అరుస్తోందో మీరు తెలుసుకోవాలి. దాన్ని ఆపడానికి “వద్దు” (No) అని గట్టిగా అరవడం వల్ల అది ఇంకా ఎక్కువగా అరుస్తుంది.
దానికి బదులుగా, ప్రశాంతంగా “నిశ్శబ్దం” అని చెప్పి, కుక్క మొరగడం ఆపిన తర్వాత దానికి శిక్షణ బహుమతిగా ఏదైనా తినడానికి ఇవ్వండి. ఇది సానుకూల శిక్షణా పద్ధతి.
గుర్తుంచుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు:
ప్రతిరోజూ ఆడుకోవడం మరియు నడపడం
(శక్తిని ఖర్చు చేయడం వల్ల మొరగడం తగ్గుతుంది),
ఆటవస్తువులు ఇవ్వడం
(విసుగును నివారించడానికి),
కుక్క మొరుగుతున్నప్పుడు దానిపై శ్రద్ధ పెట్టకపోవడం—అది ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ప్రశంసించడం. 2–3 వారాల పాటు
ఓపికతో, నిలకడగా పాటిస్తే, కుక్క మొరగడం గణనీయంగా తగ్గుతుంది.
Dog Training – ముగింపు
దూకుడు స్వభావం గల కుక్కకు శిక్షణ ఇవ్వడం అంటే దానిని భయపెట్టడం కాదు; దానికి బదులుగా, దాని దూకుడుకు గల మూల కారణాన్ని గుర్తించి, ప్రేమ మరియు సహనంతో ఆ ప్రవర్తనను సరిదిద్దడం ఇందులో ఉంటుంది. రోజువారీ వ్యాయామం, ఇతరులతో కలవడం, మరియు శిక్షణ కోసం ఇచ్చే ఫుడ్ ఉపయోగించడం వంటివి కుక్క త్వరగా నార్మల్ కావడానికి సహాయపడతాయి.
కుక్కను ఎప్పుడూ కొట్టకూడదు లేదా దానిపై అరవకూడదు. చిన్న చిన్న సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు, కానీ సమస్య తీవ్రంగా ఉంటే మంచి Dog Training Courses లో చేరడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. Dog Training Cost శిక్షణకు అయ్యే ఖర్చు కంటే, మీ కుక్కతో మీకు ఉండే అనుబంధమే చాలా ముఖ్యం. ఓపిక ఉంటే,
Faq’s – ప్రశ్నలు -Aggressive Dog Training Near Me
-
Dog Training కి ఎంత టైం పడుతుంది?
చిన్న సమస్య అయితే 1 నెల. పెద్దది అయితే 3 నెలలు కూడా పట్టొచ్చు.
-
Treats లేకుండా నేర్పవచ్చా?
నేర్ప వచ్చు. కానీ Treats ఉంటే కుక్క త్వరగా నేర్చుకుంటుంది.
-
పెద్ద కుక్కలు నేర్చుకుంటుందా?
నేర్చుకుంటుంది. కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే.
4. కొట్టడం వల్ల కుక్క బాగుపడుతుందా?
అస్సలు బాగుపడదు. ఇంకా ఎక్కువ భయపడుతుంది.


